ఆసుపత్రి అద్దాలు ధ్వంసం
సిరా న్యూస్,హైదరాబాద్;
సోమాజిగూడ యశోద ఆసుపత్రి లో టీఆరెఎస్ నాయకులు హంగామా సృష్టించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేసి అక్కడి అద్దాలు ధ్వంసం చేసారు. యశోద హాస్పిటల్ లో ఓ యూ ట్యూబర్ ను పరామర్శించడానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు. ఆసుపత్రిలో నేతలు సెల్ ఫోన్ తో వీడియోస్ తీస్తున్నారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వీడియోస్ తియకండి అంటూ అడ్డుకున్నారు. మాజీ మంత్రి నే వీడియోస్ తియ్యోదు అంటావా జగదీశ్వర్ రెడ్డి రెచ్చిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్ పై దాడికి దిగాడు.