సిరాన్యూస్, ఆదిలాబాద్
జోగు రామన్న కృషితోనే నూతన మండలాలు : బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేష్
* నూతన మండలాలలో పాలనను ప్రారంభించాలి
భోరజ్, సాత్నాల మండలాలుగా ఏర్పాటు కావడం వెనక మాజీ మంత్రి జోగురామన్న కృషి ఎంతగానో ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన హయాలో అనేక బృహత్తర కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులూ రోకండ్ల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటింటి సర్వే లో భాగంగా రెండు మండలాలకు వేర్వేరుగా కోడ్ లను కేటాయించారని తెలిపారు. వేగవంతమైన పరిపాలన సౌలభ్యం తో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషిలో భాగంగానే.నూతన మండలాల ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ చూపారని, అందుకు మాజీ మంత్రి జోగురామన్న కృషి ఎంతో ఉందన్నారు. నూతన ప్రభుత్వం ఆయా మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి పాలన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో జోగురామన్న హయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరిస్తోందని ఆక్షేపించారు. చనాక -కొరటా ప్రాజెక్టుతో పాటు 40 కోట్ల ఐటీ టవర్, పట్టణ సుందరీకరణతో పాటు గ్రామ రవాణా సౌకర్యం కల్పించడంలో జోగు రామన్నతో మాత్రమే సాధ్యమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సావాపురే విజయ్ కుమార్, మద్దుల ఉషన్న, పురుషోత్తం యాదవ్, ముక్కెర ప్రభాకర్, బట్టు సతీష్, ఎంపీటీసీలు దేవన్న, మహేందర్, రోహిదాస్, చరణ్ సింగ్, నోముల సంతోష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.