సిరా న్యూస్,మహబూబాబాద్;
ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో దారుణం జరిగింది. మంత్రాల నేపంతో వృద్దున్ని ఒక యువకుడు దారుణంగా హత్య చేసాడు. గ్రామంలో మల్లం యాకయ్య అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని రాజు చెట్టుకు కట్టేసి కొట్టి చంపాడు. అడ్డుకోబోయిన చుట్టుపక్కలవారిని బెదిరించాడు. స్థానికులు రాజును తాళ్ళతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.