సిరా న్యూస్,మెదక్;
నర్సాపూర్, సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బీవీఆర్ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఘటనలో పదిమంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.