మేడిగడ్డ కృంగుబాటుపై కేసు విచారణ

డిసెంబర్ 27 కు వాయిదా
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ కృంగుబాటు పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్ కోర్టు లో విచారణ జరిగింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా పడింది. మేడిగడ్డ ప్రాజెక్టులో నాణ్యత లోపంతో అవకతవకలు జరిగియంటూ జిల్లా స్టేషన్ కోర్టులో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి రివిజన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తేదీ అక్టోబర్ 02, 2023 రోజన భూపాలపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావు , మేఘా కృష్ణా రెడ్డి , రజత్ కుమార్ , హరి రామ్ , శ్రీధర్ అనే ఎనిమిది మంది పై 200 సీఆర్పిసీ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి కేసును డిస్మిస్ చేయడం జరిగింది.
దీంతో మార్చి 2024 లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సేషన్ కోర్టులో తిరిగి రివిజన్ పిటిషన్ వేయడం తో విచారన లో భాగంగా సెప్టెంబర్ 5వ తేదీన పై ఎనిమిది మంది కోర్టులో హాజరు కావాలని కోర్టు నోటీసులు పంపింది. తదనంతరం…పిటిషనర్ తరుపున న్యాయవాది గంట సంజీవ రెడ్డి (72) మృతి చెందడం జరిగింది. కోర్టు నోటీసులు పంపిన నేపథ్యంలో 5 గురికి మాత్రమే నోటీసులు అందాయి. కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎల్ అండ్ టీ ఎండీ సురేష్ కుమార్ కు నోటీసులు అందలేదు. దీంతో సెప్టెంబర్ 05 న హియరింగ్ రోజు హరీష్ రావు తరుపున హైకోర్టు అడ్వకేట్ లలిత రెడ్డి… మేఘా కృష్ణారెడ్డి, రజత్ కుమార్ తరఫున హైకోర్టు అడ్వకేట్ అవధాని….హరి రామ్ తరపున హైకోర్టు అడ్వకేట్ నరసింహారెడ్డి అనే ఐదుగురు హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు. విచారణ జరిపించిన కోర్టు ఈ కేసును అక్టోబర్ 17 కు ఈ రోజుకు వాయిదా వేసింది. పిటిషన తరపున న్యాయవాది గంట సంజీవరెడ్డి మృతి చెందడంతో పిటిషనర్ రాపోలు భాస్కర్ అనే హైకోర్టు అడ్వకేట్ తో పాటు మరో ఇద్దరు లోకల్ అడ్వకేట్లను పెట్టుకోవడం జరిగింది. దీంతో గురువారం హియరింగ్ కు హరీష్ రావు తరపున లలితారెడ్డి అడ్వకేట్,…మెగా కృష్ణారెడ్డి, రజిత్ కుమార్ తరపున అవధాని అడ్వకేట్. హరి రామ్ శ్రీధర్ తరపున నరసింహారెడ్డి అనే హైకోర్టు అడ్వకేట్ లు ఈరోజు భూపాలపల్లి జిల్లా సెషన్ కోర్టులో హాజరయ్యారు. సామాన్లు అందనివారికి కెసిఆర్ కు స్మితా సభర్వాల్ కు , ఎల్ అండ్ టి ఎండి సురేష్ కుమార్ సమాన్లు పంపనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *