సిరా న్యూస్,మెదక్;
తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి మార్చురీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. రోడ్డు సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుపట్టారు. పోలీసులు మృతుల కుటుంబాలకు నచ్చజెప్పి పంపించారు.