సిర్యానూస్,ఖానాపూర్
బుడ్డోని కుంట సమస్యను పరిష్కరిస్తా: మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
బుడ్డోని కుంట సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ ప్రజలు మంగళవారం మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం కు గ్రూప్ లో చాలామంది ప్రజలు బుడ్డోని కుంట గురించి పోయిన ప్రభుత్వం ఫోటోలకు మాత్రమే అంకితమైంది.. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా అని మనిషికి ఒక మాదిరిగా పోస్టులు పెట్టారు. దానికి స్పందించిన మున్సిపల్ చైర్మన్ బుడ్డోని కుంట సమస్యను మూడు రోజుల్లో తాత్కాలికంగా జేసీబీతో చేయించి, ఎమ్మెల్యే బొచ్చు పటేల్ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చేయిస్తానని చెప్పారు. దీంతో ప్రజలందరూ శాంతించారు. పోయిన పార్టీని గుర్తు చేస్తూ వాళ్లు ఫోటోలు కు మాత్రమే అంకితమయ్యారు. కాకపోతే మేము మాత్రం పనిచేసి చూపించి అప్పుడు పేపర్లలో టీవీల్లో వేయిస్తామని ఇప్పటివరకు కూడా అలాగే చేశామని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఇబ్బంది వచ్చినా ముందు మున్సిపాలిటీలో లేదా స్వయంగా మున్సిపల్ చైర్మన్ కు ఇచ్చిన సమస్య ఏంటో వెంటనే తీరుస్తానని తెలియజేశారు. అనవసరంగా వ్యక్తిగత కక్షలతో ( పార్టీ పరంగా) ఇలా అనడం చాలా తప్పు అని, మా పార్టీ తప్పనిసరి చేసి చూపించిన తర్వాత మాత్రమే మీడియాకు ఇస్తామని మున్సిపల్ చైర్మన్ మాట్లాడడం జరిగింది.