సిర్యానూస్,బేల
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐ సాయినాథ్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సాయినాథ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం మండల శాంతి కమిటీ సభ్యులతో జైనథ్ సీఐ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. పండుగను దృష్టిలో ఉంచి పశువులు అక్రమంగా తరలించకుండా అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అని పేర్కొన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పశువులకు సంబందించిన నిజ ధ్రువీకరణ పత్రాలు స్థానిక పశువైద్యుని వద్ద తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంగించిన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు . సమాచారం ఇవ్వాలి, కానీ చట్టాన్ని చేతులో తీసుకోవద్దని అలాంటి వారిపైన కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ ఐ రాధికా తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.