Chairman Ramidi Tirupathi : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌గా రామిడి తిరుపతిరెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

సిరాన్యూస్‌, కాల్వశ్రీరాంపూర్
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌గా రామిడి తిరుపతిరెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ‌ల‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌గా రామిడి తిరుపతిరెడ్డి , వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లు బాధ్యతలు చేప‌ట్టారు.ఆదివారం శ్రీరాంపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో వారు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ ఎంపీపీ గోపగాని సారన్న.ఆధ్వర్యంలోవారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంత‌రం చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు విజ్జన్న ఆశీస్సులతో బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌ర్తిస్తాన‌న్నారు. రైతాంగానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *