సిరాన్యూస్, ఇంద్రవెల్లి
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : తెలంగాణ సాంస్కృతిక సారథి నగేష్
ప్రభుత్వ ప్రవేవ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి నగేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో డీపీఆర్ఓ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అంగడి బజార్ లో ఇంటింటా సర్వే, దోమల నివారణ, డ్రగ్స్ నిర్మూలన,ఆరు గ్యారంటీ ల పై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదిలాబాద్ బృందం కళాకారులు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కళాకారులు వెంకట్రావు, రాజలింగు, రవి, రమేష్, గోవిందరావు, మురళి, శంకర్ రావు, రాథోడ్ శ్రీలత, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.