సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
ఉపాధ్యాయుడు జిన్నసతీష్ రెడ్డికి ఘన సన్మానం : మాజీ సర్పంచ్ మాదాసి సతీష్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ మండల కేంద్రానికి చెందిన కీ.శే. జిన్నా మోహన్ రెడ్డి కుమారుడు జిన్న సతీష్ రెడ్డి ఇటీవల డీఎస్సీలో సాంఘిక శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈసందర్బంగా ఉపాధ్యాయుడు జిన్న సతీష్ రెడ్డిని సోమవారం శ్రీరాంపూర్ గ్రామ యువత , మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి దేశ భావితరాలను తయారు చేసేటువంటి గొప్ప ఉద్యోగమని తెలిపారు. అటువంటి ఉద్యోగానికి స్థానికుడు జిన్నా సతీష్ రెడ్డి ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. వారు ఉపాధ్యాయ వృత్తిలో మంచి విద్యను విద్యార్థులకు అందించాలని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మార్కెట్ డైరెక్టర్లు ఎనగంటి రవి, దాగేటి రామచంద్రం, మాజీ వార్డ్ మెంబర్ కలవల శ్యామ్, బూర్ల రవి, ఎస్ఎఫ్ఐ నాయకులు సురేశ్, గ్రామ యువత వినోద్, నరేందర్, శ్రీకాంత్, రఫిక్, రమేష్ ,నరేష్ అజయ్, సాయి, మహేష్ , మల్లేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.