సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత వీరనారీ చాకలి ఐలమ్మ 139వ జయంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథని పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వీర వనిత, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, భూమికోసం, భుక్తి కోసం, పోరాటం జరిపిందని, నాటి దొరల ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసిన దీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యెగోళపు శంకర్ గౌడ్, నాయకుడు తగరం శంకర్ లాల్, కౌన్సిలర్లు కాయితి సమ్మయ్య, ఆరెపల్లి కుమార్, నాయకులు గొబ్బూరి వంశీ, ఇర్ఫాన్, కనవేనా శ్రీనివాస్, ఆసిఫ్ ఖాన్ లతో పలువురు పాల్గొన్నారు.