సిరా న్యూస్,తిరుమల;
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం రేపింది. ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. దాంతో టీటీడీ అప్రమత్తమయ్యారు. నడకమార్గంలో భక్తులకు సూచనలు చేసారు. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా వెళ్లలని సూచించారు.