సిరా న్యూస్,అమరావతి:
పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్ చార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు వైకాపా ఎమ్మెల్యేలు వచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణా రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు సీఎం కార్యాలయానికి వచ్చారు.
గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పుపై సీఎంతో బాలినేని చర్చించారని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ చార్జీలను ఖరారు చేయనునారు సీఎం.