సిరా న్యూస్,చంద్రగిరి;
వాట్సాప్ గ్రూపులో వస్తున్న అవినీతి ఆరోపణలను చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఖండించారు. ఎక్కడో ఏదో జరిగితే, ఆధారాలు లేకుండా మా కుటుంబ సభ్యులు పేర్లు ప్రస్తావించడం బాధాకరం. నా పేరు ప్రస్తావించడంతో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ లకు ఫోన్ చేసి చెప్పాను. అవినీతి ఆరోపణలపై అదే వాట్సాప్ గ్రూపులో రిప్లై ఇస్తే మా మెసేజ్’లు డెలీట్ చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న అడ్మిన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు.
ఫోన్ నెంబర్లు పరిశీలిస్తే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డివి అని తెలిసింది. మమ్మల్ని చంపాలని చూసిన చెవిరెడ్డికి తప్పుడు మెసేజ్ లు పెట్టడం లెక్కలేదు. మా తాతకే 100 ఎకరాల ఆస్తి ఉంది.. మా నాన్న డిఎస్పీ గా ఉన్న అవినీతికి పాల్పడలేదు. చెవిరెడ్డి రూ.7 వేలకు జనచైతన్య లో కమీషన్ ఏజెంట్ గా పనిచేశారు. చెవిరెడ్డికి మాకు చాలా తేడా ఉంది.. ఆయన నిన్నమొన్న డబ్బులు చూశారు. మేము డబ్బుల్లో పుట్టి పెరిగామని అన్నారు. చెవిరెడ్డి గత 5 ఏళ్లలో అవినీతి కూపంలో కూరుకుపోయరు. బయటకు రాలేక ఎమ్మెల్యే పులివర్తి నాని పై బురద జల్లుతున్నారు. పులివర్తి నాని మేనమామ అప్పట్లో గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాంటి మాపై తప్పుడు మెసేజ్ లు పంపితే ఉపేక్షించేది లేదని అన్నారు.