కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సిరా న్యూస్,సికింద్రాబాద్;
హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయ వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయన పరిశీలించారు. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఇది నాలుగో సంఘటన జరగడం బాధాకరం. హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదు. నగరంలో ఇందు పండుగలు జరుపుతున్న వేళ రాత్రి పది దాటిన తర్వాత డీజేలు సౌండ్ సిస్టం పెడితే పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు.ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారి వెనుక ఎవరెవరి హస్తము ఉన్నాదో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.