సిరా న్యూస్,నర్సాపురం;
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీచర్ల పంచాయతీ పరిధిలోని బైనపాలెంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఓ సినిమా పాట విషయంలో ఘర్షణ తలెత్తి ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబులతో పాటు పలువు రు గ్రామస్తులు గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడిన రాజేష్ ను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలు గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. అదనపు ఎస్పీ భీమారావు డి.ఎస్.పి మురళీకృష్ణులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.