ఆర్ జి 3 నిర్దేశించిన లక్ష్యం బొగ్గు ఉత్పత్తి

సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం లోని సెంటినరీ కాలనీలో గల ఆర్జి 3 బొగ్గు గనుల నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఆర్ జి త్రీ జి ఎం సుధాకర్ రావు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారంఆగష్టు నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు.
ఆగష్టు నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఆర్.జి-3 జి.ఎం. ఎన్.సుధాకరరావు మాట్లాడుతూ ఆగష్టు నెలలో ఆర్.జి-3 ఏరియాకు నిర్దేశించిన 4.19 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 4.15 లక్షల టన్నులు అనగా 99 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 38.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి)వెలికితీత లక్ష్యానికి గాను, 26.42 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 69 శాతం ఓ.బి(మట్టి) వెలికి తీయడం జరిగిందని, అదేవిధంగా 5.47 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.
తదుపరి గనులవారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ ఆగష్టు నెలలో ఓ.సి.పి-1 గనికి నిర్దేశించిన 2.19 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 2.83 లక్షల టన్నులు అనగా 129 శాతం, ఓ.సి.పి-2 గనికి నిర్దేశించిన 2.00 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1.32 లక్షల టన్నులు అనగా 66 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.
అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జి.ఎం. కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కి ఆగష్టు నెలలోనిర్దేశించిన 0.17 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.11 లక్షల టన్నులు అనగా 63 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, 0.23 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. అందుకు కృషి చేసిన ఉద్యోగులందరికి వారు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. మున్ముందు ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించడానికి కృషి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *