సిరాన్యూస్, ఆదిలాబాద్
నిమజ్జన శోభాయాత్రను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగిన వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా పట్టణంలోని వినాయక్ చౌక్, బొక్కలగూడ, ఖానాపూర్ లలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరా ద్వారా భధ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన బందోబస్తును, గణనాథుని శోభా యాత్ర, ట్రాఫిక్ నియంత్రణ ను పరిశీలించారు.