సిరాన్యూస్, ఆదిలాబాద్
సర్టిఫికెట్ వేరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న డీ ఎస్సీ సర్టిఫికెట్స్ పరిశీలన ప్రక్రియను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. ఈసందర్భంగా డీఈఓ, సిబ్బందిలో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. సర్టిఫికెట్స్ పరిశీలన అక్టోబర్ 5 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందనీ,ఎనిమిది కమిటీల ద్వారా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ల ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నదని తెలిపారు.