సిరాన్యూస్, ఆదిలాబాద్
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షి షా
సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పారదర్శకంగా , ఎలాంటి తప్పులకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ , 6వ తేది నుండి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక ,విద్య, రాజకీయ , కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎన్యుమరేటర్లు మున్సిపల్ , గ్రామస్థాయిలో వార్డు నుండి మొదలుకొని కేటాయించిన బ్లాక్ స్థాయి వరకు పూర్తిస్థాయిలో సమాచార సేకరణ , నమోదును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్వే నిర్వహణలో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అలాగే సర్వే నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.ఈ సర్వేలో అందరినీ భాగస్వామ్యం చేయాలనీ , ఈ రోజు ఎన్యుమారెటర్లుగా నియమించిన టీచర్లకు శిక్షణా ఇవ్వడం జరిగిందని, బుధవారం నుండి ప్రారంభం కానున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్‌డీఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.