సిరాన్యూస్, ఇంద్రవెల్లి
నాటిన మొక్కలను సంరక్షించాలి: కలెక్టర్ రాజర్షి షా
* గౌరపూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు స్థల పరిశీలన
నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గౌరపూర్ గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు స్థలాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా గౌర పూర్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలం లో నాలుగు ఎకరాలలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని, ఈ సంవత్సరం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నాలుగువేల మొక్కలను నాటాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణ , కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యం లో అటవీ శాతాన్ని పెంచేందుకు బృహత్ పల్లె ప్రకృతి వనం ఎంతగానో దోహద పడతాయనీ, ఈ సందర్భంగా ఈ గ్రామం లో 4 ఎకరాలలో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేయాలని డీఆర్‌డీఓ సాయన్న ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.