గ్యారంటీపైనే కాంగ్రెస్ ఆశలు

సిరా న్యూస్,ముంబై;
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారంటీ బాట పట్టింది. గెలుపునకు గ్యారంటీలే పనికొస్తాయని మరొకసారి నమ్మింది. కర్ణాటక, తెలంగాణలో తరహాలో మహారాష్ట్రలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రకటించినప్పటికీ గెలుపును సాధించలేకపోయింది. అయితే తమను ప్రజలు విశ్వసించినా ఈవీఎంల కారణంగానే తాము ఓటమి పాలయ్యామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది.అందుకే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్లింది. తొలుత గ్యారంటీలపై కొంత ఆలోచించి చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలను ప్రకటించారు. ఈ ఐదు గ్యారంటీలను చూసి ప్రజలు తమవైపు మళ్లుతారని భావిస్తుంది. మహారాష్ట్రలో కూటమిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా మారఠా రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకోసమే ఐదు గ్యారంటీల పేరుతో ముందుకు వెళ్లింది. ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసంతో ఐదు గ్యారంటీలను మళ్లీ ప్రజల ముందుకు తెచ్చింది.మహారాష్ట్రంలో ఐదు గ్యారంటీలకు భాగ్య లక్ష్మి అని నామకరణం చేసింది. ఈ ఐదు గ్యారంటీలు ఇవీ… 1. మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. 2. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 3. మూడు లక్షల వరకూ వ్యవసాయ రుణమాఫీతో పాటు 15 లక్షల వరకూ కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. 4. కులగణన చేస్తామని తెలిపింది. 5. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపింది. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలుపు బాట నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. ప్రజలు వీరి ఐదు గ్యారంటీలను విశ్వసిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
600 కోట్లు సీజ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నవంబర్‌ 6 వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదు, ఇతర తాయిలాలను సీజ్‌ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సీజ్‌ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచిత వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.ఒక్క మహారాష్ట్రలోనే ఈసీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి దాదాపు రూ.280 కోట్లు స్వాధీనం చేసుకుంది. అటు జార్ఖండ్‌లో ఇప్పటి వరకు రూ. 158 కోట్ల విలువైన మొత్తాన్ని సీజ్‌ చేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రెండు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో కలిపి 3.5 రెట్లు పెరిగి మహారాష్ట్ర రూ. 103.61 కోట్లు కాగా, జార్ఖండ్‌కు రూ. 18.76 కోట్లు అని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *