సిరాన్యూస్,ఆదిలాబాద్
దండారి ఉత్సవాలలో కంది శ్రీనివాస రెడ్డి
* ఆదివాసీలకు దుస్తుల పంపిణీ
ఆదిలాబాద్ నియోజక వర్గంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివాసీల చెంతకు వెళ్లి దండారి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. దీపావళి పండగకి ముందు ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే దండారి సంబరాలకు హాజరై వారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించిన ఆయన యాపల్ గూడ , మత్తడి గూడ , రాములు గూడ , మావల మండలంలోని వాఘాపూర్ ,కొలాంగూడ గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులు డప్పుచప్పుళ్లు ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఆదివాసీలందరికి పండగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులు పంపిణీ చేసారు. తను ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మనిషినని నిరూపించుకున్నారు. దండారి దీక్ష చేపట్టిన ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. ఆదివాసీలు తమ సమస్యలు కూడా ఆయన దృష్టికి తెచ్చారు. ఇంచార్జి మంత్రి సీతక్క తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతీయేడు దండారీలకి 15వేలు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. అందుకే ప్రభుత్వం పోడుభూమలుకు పట్టాలిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,ఎస్టీ సెల్ ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సెడ్మాకి ఆనంద్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న, దొగ్గలి రాజేశ్వర్, మర్సకోల గౌతమ్, రొడ్డ నారాయణ మామిళ్ల భూమయ్య, పోరెడ్డి కిషన్, సుధాగోని సుధాకర్ గౌడ్, యెల్టీ భోజా రెడ్డి, అనుముల ఊషన్న,అనుముల ఉదయ్ కిరణ్,సార్ల సత్యనారాయణ, ఎం.ఏ షకీల్,మంచాల పోతన్న,ఎల్మ రామ్ రెడ్డి, మినుకు నారాయణ రెడ్డి,దాసరి ఆశన్న,అనక గంగారాం,షేక్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.