వివాదస్పదమౌతున్న పోలీసుల ప్రవర్తన

సిరా న్యూస్,కరీంనగర్;
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కొంతమంది పోలీసు అధికారుల దురుసు ప్రవర్తన మాత్రం మారడం లేదు. నిత్యం సామాన్య ప్రజల రక్షణ ద్యేయంగా ఉండాల్సిన ఖాకీలు సామాన్య ప్రజలపై వీధి రౌడీలలా ప్రవర్తిస్తున్న ఘటనలు కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. కొంతమంది పోలీసులు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే వారికి న్యాయం చేసే పనిలో ఉంటే, మరికొందరేమో అవినీతికి పాల్పడుతున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఒంటిపై యూనిఫామ్ ఉంటే చాలు ఇక సామాన్య ప్రజలపై మాదే అధికారం అనే విధంగా జులుం ప్రదర్శిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం రోజురోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యం మండలంలోని ప్రజలను భూ వివాదాల విషయంలో వేధించడంతో బాధితులంతా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతున్న విషయం విధితమే ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ భార్యాభర్తల కుటుంబ సమస్యలతో మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ పేరుతో ఓ మహిళ ఎస్సై ఆ వ్యక్తిపై చేయి చేసుకోగా ఆవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయంలో ఎస్ఐ శ్వేతపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.
1) కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్లో గతంలో విధులు నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి ఓ కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్లో జరిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నత అధికారులు శాఖపరమైన చర్యలు చేపట్టారు.
2.) గతంలో గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించే సమయంలో ఓ దళిత యువకుడిని నడిరోడ్డు పై చితక బాదారు. పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్సైకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
3) గతంలో స్వప్న అనే మహిళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా కొంతమంది వారిపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యం వహించారు. దాంతో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
4) సారంగం అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వెళ్లగా అటుగా వెళుతున్న ఇంద్రసేనారెడ్డి తనను పిలిచి చెంపపై కొట్టి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐ ఇంద్రాసేనారెడ్డి వచ్చే సమయంలో షాపు ముసివేయలేదని బూతుపురాణం మొదలు పెట్టి ఏకంగా కొబ్బరికాయలు అమ్ముకునే నిర్వాహకుడిపై చేయి చేసుకున్నాడు. అయితే రాత్రి 10 గంటలైనా షాపు మూసి వేయలేదని సీఐ తన ప్రతాపాన్ని చూపించాడు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రాత్రి 1:00 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, పాన్ షాపులు నడిచిన కనిపించడం లేదా అని ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బిర్యాని సెంటర్లు నడిస్తే కానీ దేవుడి పూజ సామాగ్రి అమ్ముకునే షాపు నడిస్తే తప్పా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సమాజంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టే పనిలో పడి నిద్ర లేమి సమస్య ఉంటుంది. దాంతోపాటు ఉన్నతాధికారుల ఒత్తిడితో పోలీసులు లాంటి శాఖల్లోని వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు. బ్లడ్ ప్రెషర్ పెరిగి ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చే కోపంతో కొందరు పోలీసులు ఎవరితో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారోనని.. ఒక వేళ ఒత్తిడి అనిపిస్తే మానసిక వైద్యులను కలిసి పరిష్కారం తెలుసుకోవాలని నిపుణులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *