సిరా న్యూస్,నిడదవోలు;
నిడదవోలు మండలంలో రోడ్డు ప్రమాదం, పైడిపర్రు గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుర్మరణం చెందారు. నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. త్రి వే హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు బెల్లంకొండ వెంకటేశ్వరరావు(60), బెల్లంకొండ దర్గ (50) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన వీరు కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జరిగే శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.