సిరా న్యూస్, ఓదెల
సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలన అధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు పాలన అధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్ ఉదయం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్బంగా ఓదెల మండల కేంద్రానికి చెందిన నాగ పురి పైడిరాజు అనే రైతు తనకున్న పొలం ఆన్లైన్లో చూపించడం లేదని, మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ప్రజావాణి ద్వారా కలెక్టర్ కి అర్జీ సమర్పించారు.అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సానుకూలంగా స్పందించారు.