:సిరా న్యూస్,దేవనకొండ ;
ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని 2002-2003 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహాయం అందించారు సాటి విద్యార్థి మిత్రులు దేవనకొండ మండలంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన బి లక్ష్మన్న కొన్ని నెలల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు.ఈ విషయం తెలుసుకున్న 2002-03 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి 60 వేల రూపాయల నగదును తనతోపాటు చదువుకున్న స్నేహితుల నుంచి సేకరించి ఆదివారం తమ కుటుంబ సభ్యులకు అందజేశారు. లక్ష్మన్నకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. లక్ష్మన్న కుటుంబం నిరుపేద కుటుంబం.ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు లక్ష్మన్న కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు తిరుమలేష్, సుధాకర్, బజారి, సత్య, పరమేష్ ,ప్రకాష్, హాజీ, సురేంద్ర ,అంజి, వెంకటేష్, మల్లి తదితర మిత్రులు పాల్గొన్నారు