సిరా న్యూస్,విశాఖపట్నం;
విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి గుర్ల గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని బాధితులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితిని అచప పరిశీలించారు. అంతకు ముందు వాటర్ సోర్స్ పాయింట్స్ పరిశీలించారు. తరువాత అతిసారం కట్టడికి చేపట్టిన నివారణ చర్యల మీద, ప్రస్తుత పరిస్థితి మీద, నీటి కాలుష్యం తగ్గించేందుకు భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలు మీద పవన్ కళ్యాణ్ విజయనగరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షించారు.ప