సిరా న్యూస్, కాల్వశ్రీరాంపూర్
వైస్ ఛాన్సలర్ ను సన్మానించిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామానికి చెందిన దండ రాజిరెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వనశాఖ వైస్ ఛాన్స లర్ గా ప్రభుత్వం నియమించింది. సోమవారం మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఉద్యానవన శాఖ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డిని హైదరాబాదులోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ మండలంలోని జాఫర్ఖాన్ పేట శివారులో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం దండ రాజిరెడ్డి సహకారంతోనే ఏర్పాటు అయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత గీట్ల ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాంతంలో వ్యవసాయ పరిశోధన ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, గీట్ల ముకుంద రెడ్డిలు 2007 అక్టోబర్ లో కుమార వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు వరిపై పరిశోధన జరిపిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో వరి వంగడాలను తయారుచేసి కునారం పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన వరి విత్తనాలు సన్న వరి విత్తనాలు, దొడ్డు వరి విత్తనాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర, కర్ణాటక పలు రాష్ట్రాలలో కూనారం వరి వంగడాలు రైతులకు అధిక మొత్తంలో దిగుబడి వస్తుందన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటుకు గిట్ల ముకుంద రెడ్డి ఎంతో కృషి చేశారు అన్నారు.ఈ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన వైస్ ఛాన్సర్ దండ రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార కిషోర్ వకీల్ , ముత్యం శంకర్ గౌడ్, దండ కొండల్ రెడ్డి, రమణారెడ్డి, ఏడీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.