పినిపే శ్రీకాంత్ అరెస్టు

సిరా న్యూస్,కోనసీమ;
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు న్నరేళ్ల క్రితం హత్యకు గురైన వాలం టీర్, దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసును పోలీ సులు చేధించారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వ రూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్తో పాటు పలువురు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు కేసు విచారణ చేశారు. రమేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా హత్య కేసులో పినిపే శ్రీకాంత్ ప్రధాన నిందితుడుగా గుర్తించారు. దీంతో తమిళనా డులోని మధురైలో తలదాచుకున్న శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. మధురైలో పినిపే శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై ఏపీకి తరలిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *