సిరా న్యూస్, ఓదెల
పోచమ్మ గుడికి విరాళాలు సేకరణ : మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్న స్వామి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి గ్రామ పెద్దలు విరాళాలు సేకరిస్తున్నారు. ఓదెల గ్రామంలో పుట్టి పెరిగిన వివిధ ప్రాంతాలలో ఉపాధి నిమిత్తం స్థిరపడిన పెద్దలను పోచమ్మ దేవాలయానికి విరాళాలు సేకరించుటకై సోమవారం ఓదెల మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి, చిన్నస్వామి ఆధ్వర్యంలో విరాళాల సేకరణకై మంచిర్యాల గోదావరిఖని ప్రాంతాలలో స్థిరపడ్డ వారి వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. విరాళాలు అందించినవారు మడ్డి ఎల్లయ్య, పల్లెర్ల రాజేశం, బ్రాహ్మాండ్లపల్లి శ్రీనివాస్ మణికంఠ కంప్యూటర్ ఉడ్ కార్వింగ్ , ఉ డెన్ వర్క్స్ గోదావరిఖని మాట్లాడుతూ మేము పుట్టిన ఊరు ఓదెల గ్రామంలో పోచమ్మ దేవాలయాణినికి పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనుకున్నాం సహాయం చేశామన్నారు. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అని అన్నారు. కార్యక్రమంలో ఓదెల మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్న స్వామి, ముద్దసాని కుమారస్వామి,అల్లం సతీష్, పచ్చిమట్ల శ్రీనివాస్, ఇందుర్తి శ్రీనివాస్, దాసరి కోటి, మంద కొమురయ్య, చెరుకు శంకరయ్య, రాపల్లి రాజయ్య, తీర్థాల రాజారామ్, పెండం రాములు తదితరులు ఉన్నారు.