సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కావడంతో మల్లన్న క్షేత్రం భక్తులతో కళ కళలడుతుంది ఉదయం నుండి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవు కూడా ఉండటంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది భక్తుల వేకువజామున నుండే పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ క్యూలైన్స్ లో క్యూ కంపార్ట్మెంట్ లలో బారులు తీరారు దీనితో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది మరోపక్క దసరా నవరాత్రులు కూడా ఉండటంతో భక్తులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తుల రద్దీతో అధికంగా ఉండటంతో క్యూ లైన్స్,కంపార్ట్మెంట్ లలో అల్పాహారం, పాలు,బిస్కెట్లు మంచి నీరు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు దసరా మహోత్సవాల నేపద్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భావిస్తున్నారు అలానే సాయంత్రం దసరా మహోత్సవాల మూడోవరోజు కావడంతో సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి రావణవాహనంపై శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు అధిరోహించిన ప్రత్యేక పూజలందుకొని ఆలయ పురవీధుల్లో వందలాది మంది భక్తుల నడుమ గ్రామోత్సవంగా విహరించారు.