దళిత బందు రెండవ విడత నిధుల కోసం అర్ధనగ్న ప్రదర్శన…

సిరా న్యూస్,జమ్మికుంట;
దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో దళితబందు రెండవ విడత నిధులు మంజూరు చేయాలని జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేసిన బాధితులు, ఇప్పటికే దళిత బందు విడుదల చేయాలని అనేక కార్యక్రమలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల పట్ల వివక్షత చూపుతున్నాడని, దళితులు ఆర్థికంగా ఎదగడం ముఖ్యమంత్రి కి ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నాడని,ఈ వైఖరి మార్చుకోకపోతే దళితుల ఉగ్రరూపం చూడాల్సివస్తుందని సాధన సమితి సభ్యులు అన్నారు.
దళితబందు పథకంలో వాహనాల స్కీం పెట్టుకున్న వారికీ పూర్తిస్థాయిలో 10లక్షలు మంజూరు చేసినట్టు షాపుల స్కీం పెట్టుకున్న వారికీ కూడా మిగతా 5 లక్షలు మంజురు చేసి దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని లేని పక్షంలో దళితులము అంత ఏకమై హైదరాబాద్ నడిబోడ్డున వెలసంఖ్యలో వచ్చి దళితుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచ్ ఎన్నికల లోపు దళిత బంధు రెండవ విడత నిధులు మంజూరు చేసేవిదంగా చొరవ తీసుకోవాలని కోరారు,
ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, కోలుగూరి నరేష్, అకినపల్లి ఆకాష్, ఇనుగాల బిక్షపతి, కోడెపాక రక్షిత్,గాజుల కూమర్,మహంకాళి రమేష్,రామంచ శ్రీకాంత్, పాత రాజేష్, ప్రవీణ్, సరిత,అరుణ, సుమారు 200 మంది బాధితులు
పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *