సిరాన్యూస్, చిగురుమామిడి
దళిత ఆత్మీయసభకు తరలిరండి : దళిత సంఘాల ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ లింగాల సాయన్న
నియోజకవర్గ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న హుస్నాబాద్ లోని కేజేఆర్ గార్డెన్ లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించ తలపెట్టిన ఆత్మీయసభకు ఎస్సీలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని దళిత సంఘాల ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ లింగాల సాయన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో దళిత సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్వీనర్ లింగాల సాయన్న మాట్లాడుతూ దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి తో పాటు, “పొట్టేల్” మూవీలో నటించిన కళాకారులను ఘనంగా సన్మానించ నున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని దళితుల ఐకమత్యాన్ని చాటుటకు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమ్మేళనానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని పేర్కొన్నారు. దళితులు అధికంగా ఈ సమ్మేళనంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌరవ సలహాదారులు మంద ధర్మయ్య, కోఆర్డినేటర్ ముక్కెర సంపత్ కుమార్, దళిత నాయకులు సాంబరి కొమురయ్య, మామిడి అంజయ్య, బెజ్జంకి లక్ష్మణ్, బెజ్జంకి అంజయ్య, బోయిని శ్రీనివాస్, బోయిని బాబు, కొడముంజ రవీందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.