సిరా న్యూస్,న్యూ ఢిల్లీ;
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కానున్నారు.
జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. అక్టోబర్ 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో అరెస్ట్, బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు వేశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ని సీబీఐ చట్ట విరుద్ధంగా అరెస్టు చేసిందని, ఆయనకు వ్యతిరేకంగా ఎటు వంటి ఆధారాలు లేవని అభిషేక్ మను సింఘ్వి అన్నారు.
బెయిల్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఇప్పటికే ఈ కేసులో సిసో డియా, కవిత సహా ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని తెలిపారు. కేజ్రీవాల్ కి బెయిల్ మం జూరు చేయాలని కోరారు. కేజ్రీవాల్ బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించింది.
కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందని, కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది. అరెస్ట్ కి సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నామని చెప్పింది.
ట్రయల్ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ కి గల కారణాలు తెలిపామని, కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా చార్జ్ షీట్ దాఖలైందని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం చివరకు బెయిల్ మంజూరు చేసింది.