సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ మదుబన్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమించి వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకున్న వారిపై జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జూలిపించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది.