సిరా న్యూస్,హైదరాబాద్;
ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కలాం గారి దేశసేవకు చేసిన అపూర్వమైన కృషిని స్మరించుకున్నారు. విద్య, విజ్ఞానం మరియు సాంకేతికత రంగాలలో ఆయన చేసిన మార్గదర్శక పాత్రను గురించి మాట్లాడారు.
డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ “కలాం గారి జీవితం ప్రతి యువకుడికి ప్రేరణగా నిలవాలి” అని పేర్కొన్నారు. విద్యలో పురోగతి సాధించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందనీ, ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్, భాస్కర్, రాజు గంట, అనిల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు