కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
సిరా న్యూస్,వికారాబాద్;
విఎల్ఎఫ్ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనది. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించదం హర్షణీయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కి కృతజ్ఞతలు. దేశం భద్రత రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదని అన్నారు. దేశం యొక్క బలమైన మరియు భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు మన దేశానికి అత్యంత ముఖ్యమైనవి. పూర్వం కమ్యూనికేషన్ మరియు సమాచారం కోసం ఈగల్ మరియు ఇతర పక్షులను ఉపయోగించాము. ఇతర కమ్యూనికేషన్లను వ్యవస్థను బలోపేతం చేస్తు ఉపయోగిస్తున్నాము. కమ్యూనికేషన్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నాము. గత ముప్పై సంవత్సరాల నుండి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశం బలమైన మిలిటరీని నిర్మించడానికి కట్టుబడి ఉందని అన్నారు.
కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ గురించి తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తున్నారు. మరియు పర్యావరణానికి నష్టం జరిగిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని చెబుతున్నాను. కొంతమందికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దేశ రక్షణ భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.