సిరా న్యూస్,రామచంద్రపురం;
కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకొని దక్షిణ కాశీగా పిలవబడే ద్రాక్షారామం శ్రీ మణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేకువ జాము నుంచే భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటు ధిపారద చేసుకుంటున్నారు పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామానికి కార్తీక మాసంలో వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. సోమవారం రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఉచిత దర్శనాలు కల్పస్తున్నారు అదేవిధంగా 50 రూపాయలు వంద రూపాయలు దర్శనాలను కూడా ఆలయ అధికారులు భక్తులకు కలగజేశారు. పిల్లలకు ఉచితంగా పాలు పెద్దలకు తాగునీరు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి టీ తార్కేశ్వరావు వెల్లడిస్తున్నారు.