సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో 14 ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి స్వైర విహారం చేశాయి. ఆదివారం రాత్రి సుమారు 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మండలంలోని దానమయ్యగారిపల్లి, కుమ్మరిమడుగు, మిట్టూరు,నక్కనపల్లి, మోట్లపల్లి గ్రామ పంట పొలాలలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు చేతికి వచ్చిన పంటలను నాశనం చేసాయి. లక్షల విలువ చేసే పంట పొలాలను పోగొట్టుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి చోరబడుతున్నటువంటి ఏనుగుల గుంపు కారణంగా భయంతో రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా నిద్రిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగుల మందను తరిమే ప్రయత్నంలో విఫలం అయ్యారు. ఉదయం తిరిగి అడవిలోకి ఏనుగుల గుంపు వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.