సిరా న్యూస్, హుజురాబాద్:
విద్యార్థులు ఉద్యోగాల పై దృష్టి పెట్టాలి : కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డా. కందుకూరి శంకర్
* వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
విద్యార్థులు ఉద్యోగల మీద దృష్టి సాధించాలని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డా. కందుకూరి శంకర్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం ,మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం చెబుతూ మంగళవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డా. కందుకూరి శంకర్ హాజరై మాట్లాడుతూ సీనియర్స్ నుండి సూచనలు సలహాలు తీసుకుని, గవర్నమెంట్ జాబ్స్ మీద దృష్టి సారించాలని, మీ బంగారు భవిష్యత్తు కు డిగ్రీ టర్నింగ్ పాయింట్ అని మంచి మార్కులు సాధించి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో డిగ్రీ కళాశాల ఉంటడం వలన లైబ్రరీని ఉపయోగించుకొని విద్యార్థులు ఉద్యోగల మీద దృష్టి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, అధ్యాపకులు తాళ్లపెళ్లి అజయ్, పోతిరెడ్డి హరీష్, చల్లూరి సతీష్ ,గొబ్బెట తిరుపతి, గాజుల శారద, గట్టు కోమల, మహేష్, సదయ్య, భాస్కర్, రచన విద్యార్థులు పాల్గొన్నారు.