అభినవ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

సిరా న్యూస్,తాండూర్;
అభినవ కల్చరల్, సోషల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ మరియు అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంజనిపుత్ర ఎస్టేట్స్ సహకారంతో తాండూర్ లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఐబి తాండూర్ లో అభినవ ఆర్గనైజేషన్ చైర్మన్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో శ్రీనివాస్ చేతుల మీదుగా మట్టి విగ్రహాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విస రసాయనాలతో తయారైన గణేశుని ప్రతిమలను నీటిలో వేయడం ద్వారా జలచర ప్రాణులు ఎంమరణిస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి నీటిని త్రాగిన పశువులు సైతం అనారోగ్యాల పాలవుతాయని వారన్నారు. అట్టి నీటిని వాడిన యెడల మానవజాతికి సైతం క్యాన్సర్ , చర్మవ్యాధులు తోపాటు ప్రాణంతక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ యొక్క జీవవైవిద్య పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంజన్ కుమార్,ఏఈపిఆర్ విష్ణు,
ఏపీవో నందన్ కుమార్, సత్యనారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఈసా,సిరంగి శంకర్ మహేందర్ రావు, సూరం రవీందర్, ఎల్క రాంచందర్,చిలువేరు శేషగిరి,బోనగిరి చంద్రశేఖర్, కృష్ణదేవరాయలు,బియ్యాల నిఖిల్, పొట్లపల్లి రాజ్ కిరణ్, వేముర్ల ప్రవీణ్, కుమార్, కాసం భాస్కర్, కోంకుముట్టి సత్యనారాయణ, సామ రమేష్, తొగరి శ్రీనివాస్, హనుమండ్ల విక్రమ్,వినయ్,పాగిడి సంతోష్ ,సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *