సిరాన్యూస్ , ఓదెల
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్
* ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓదెల శ్రీ.ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓదెల మండలం డిప్యూటీ తహశీల్దార్ అనీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ నేత్రదానంతో పాటు ఇతర సామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు.ఇందులో భాగంగా మట్టి వినాయకులు ముద్దు/పిఒపి వినాయకులు వద్దు అనే నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ భీష్మాచారి మాట్లాడుతూ ఓదెల మండలం ప్రజలు నేత్ర అవయవ శరీర దానాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సహకరించాలని కోరారు. మండపాలలో మట్టి వినాయకులను పూజిస్తూ, ప్లాస్టిక్ గ్లాసులు,బాటిల్స్, కవర్లు ప్లాస్టిక్ కోటెడ్ విస్తర్లు నివారిస్తే పర్యావరణాన్ని, మన ఆరోగ్యాలను సంరక్షణ చేసుకోవచ్చని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో అల్లం సతీష్, క్యాతం మల్లేశం, మేరుగు సదానందం, సింగని నర్సింహులు, రమేష్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.