సిరాన్యూస్ , ఓదెల
వడ్డేపల్లి కృష్ణ మృతి సాహిత్య లోకానికి తీరని లోటు
* రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు
వడ్డేపల్లి కృష్ణ మృతి సాహిత్య లోకానికి తీరని లోటు అని రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు అన్నారు. గత కాలంగా వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన మృతికి పెద్దపల్లి రచయితల సంఘం నాయకులు బి. రవీంద్రా చారి.నూనె రాజేశం. కూ చన మల్లయ్య. బుర్ర తిరుపతి సంతాపం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు, ఆడియో ఆల్బమ్ ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా, విభిన్న పార్శ్వాల్లో తన రచనా నైపుణ్యాన్ని ప్రజలకు అందించారన్నారు.