సిరా న్యూస్,సిద్దిపేట;
ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లాలో కొంతమంది ప్రజా ప్రతినిధులు సొంత వాహనాలకు పోలీస్ సైరన్ ఏర్పాటు చేసుకున్నారు.
సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆరు వాహనాలకు సైరన్స్ తీసివేసారు. ప్రభుత్వ అనుమతి లేనిది సొంత వాహనాలకు పోలీస్ సైరన్ బిగించవద్దు. ఈ సందర్భంగా సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్ మురళి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట గజ్వేల్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా వారి యొక్క సొంత వాహనాలకు పోలీస్ సైరన్ ఏర్పాటు చేసుకుని వాహనాలు నడుపుతున్నారని సమాచారం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఆరు వాహనాలను గుర్తించి సైర0న్ తీసివేసారు. ఇంకా కొన్ని వాహనాలకు ఉన్నట్లు సమాచారం ఉంది సంబంధిత వాహన యజమానులు పోలీస్ సైరన్ తీసివేయాలని సూచించారు. లేనియెడల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహన యజమానులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఏఎస్ఐ జగదీశ్వర్, హెడ్ కానిస్టేబుళ్లు రఘు, కుమార్,మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.