సీఎం చంద్రబాబుకు చెక్కు అందించిన ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్
సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్రంలో భారీ ఎత్తను సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురి చేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానని శ్రీనివాస్ అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు అన్నారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకుగాను శ్రీనివాస్ ను సీఎం అభినందించారు.