సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి నగర్ కాలనీ లో ఓ గోడౌన్ లో ఉంటున్న యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్ చల్ చేసినట్లు కాలనీవాసులు తెలిపారు.ప్రశ్నించిన కాలని వాసుల పై యువకులు తిరగబడి ఇష్ట రీతిగా ప్రవర్తించినట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, గోడౌన్ లో పనులు చేసుకునేందుకు వచ్చిన కొంతమంది మార్వాడి యువకులు గంజాయి మద్యం సేవిస్తూ కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. పలు సందర్భాలలో మహిళలను కూడా గోడంలోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై గోడౌన్ యజమాని దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు. కాలనీలో ఉంటున్న మహిళలకు చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని వెంటనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాలనీవాసులు తెలిపారు.ఘటనస్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు కాలనీవాసుల నుండి వివరాలు సేకరించారు.