సిరా న్యూస్, సైదాపూర్:
జోనల్ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన దొంత అంకిత్‌కు సన్మానం
సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన దొంత అంకిత్ జోనల్ స్థాయి స్విమ్మింగ్ పోటీలో ఎంపికైన సందర్భంగా జడ్పీ హైస్కూల్లో అంకిత్ అతని తండ్రి దొంత సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. నవంబర్ 2న రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలో విజయం సాధించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో యాదగిరి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి వైదేహి, హెడ్మాస్టర్ దేవేందర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతిమ, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొండ గణేష్, కూతురు విద్వాన్ రెడ్డి, బొమ్మగాని రాజు, తదితరులు పాల్గొన్నారు.