Dr. Sridhar: ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దు: డాక్టర్ శ్రీధర్

సిరాన్యూస్, చర్ల
ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దు: డాక్టర్ శ్రీధర్

ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్ద‌ని డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆర్ఎంపి చేస్తున్న పరిధికి మించి చేస్తున్న వైద్య దందాపై వస్తున్న వరుస కథనాలకు స్పందించిన జిల్లా వైద్య శాఖ స్పందించింది. గురువారం చర్ల మండలంలోని ఆర్ఎంపి , పిఎంపీలకు కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి, పిఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దని, హెచ్చరిస్తూ రోగులకు అత్యవసర వైద్యం అందించలే తప్ప శృతి మించి వైద్యం చేసి వారి ప్రాణాలను బలి తీసుకోవద్దని అన్నారు. ఆర్ఎంపి క్లినిక్ సెంటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో సెటప్ చేసి నడుపుతూ రోగులను దోచుకుంటున్నారని అలాంటి అంకుల్ ఆర్భాటాలు క్లినిక్ సెంటర్లలో ఇకనుంచి కనిపించకూడదని, అవుట్ పేషెంట్ ఓపి రిజిస్టర్ కచ్చితంగా కచ్చితంగా ఉండాలని, క్రిటికల్ కేసులు వచ్చినప్పుడు వైద్య శాఖకు సమాచారం ఇవ్వాలి అని, రోగుల ప్రాణాలు తీసే మితిమీరిన ఆంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ ఎక్కువ వాడొద్దని జిల్లా ఆరోగ్య శాఖ వారి ఆదేశాలు పాటించకుండా బరితెగిస్తే అలాంటి ఆర్ఎంపీ క్లినిక్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ హనుమంత్, రామలక్ష్మి సిహెచ్ఓ, రాంప్రసాద్. హెచ్ ఎస్, ల్యాబ్ టెక్నీషియన్ గోపి, కనకదుర్గ హెచ్ ఎస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *